పండంటి డిజిటల్ పేమెంట్లకు పదకొండు తాయిలాలు!

పండంటి డిజిటల్ పేమెంట్లకు పదకొండు తాయిలాలు!

రచన శ్రీకాంత్ తేది 26/09/2016

నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రకటన నల్లబాబులకు నిద్రపట్టకుండా చేసింది. ఆ రాత్రి నుంచి వాళ్లకు అన్ని రాత్రులూ కాళరాత్రులే. తేలుకుట్టిన దొంగల్లా కిక్కురుమనకుండా నలుపును తెలుపు చేసుకోవడం ఎలా అనే దానిపై దృష్టి సారించారు. బయటకు రావడం లేదుగానీ- వీలైనన్ని దారులు వెతుకుతున్నారు. ఇది కొట్టిపారేయలేని వాస్తవం. 
 
అంతెందుకు సాక్షాత్తూ బ్యాంకు మేనేజర్లే కమిషన్లకు కక్కుర్తిపడి బ్యాక్ డోర్ నుంచి వందల కట్టలను బయటకు వదిలారు. ఈ విషయం ఆర్బీఐ దృష్టికి కూడా వచ్చింది. ఇలా అయితే లాభం లేదని బడాబాబులంతా బీదాబిక్కీ జనం మీద పడ్డారు. వాళ్ల జన్ ధన్ ఖాతాల్లో లక్షల రూపాయలు డిపాజిట్లు చేయించారు. ఇవిగాక రోజుకూలీ కింద కొందరిని మాట్లాడుకుని వాళ్లను బ్యాంకుల చుట్టూ తిప్పి 500, 1000 నోట్ల మార్పిడి చేయించారు.
 
అయినా గానీ ఇండియాలో సాధ్యం కానిదేముంది చెప్పండి. కరెక్టే.. దారులు తెలియాలేగానీ అందులోకి చొచ్చుకుపోవడం ఎంతసేపు..? చిటికెలో పని. దీపం ఉండగానే ఇల్లుచక్కబెట్టుకునే సూత్రాన్ని మనసావాచా నమ్మిన వ్యక్తులున్న సమాజం మనది. అవకాశాలు వెతకడమే కాదు.. అవకాశాలు సృష్టించడం కూడా తెలిసిన ఘనులున్నారు. అఫ్ కోర్స్.. ఇందులో లీగల్ ఉంది.. ఇల్లీగల్ కూడా ఉందనుకోండి. అది వేరే విషయం.
 
ఉదాహరణకు పేటీఎంనే చూడండి. ప్రధాని ప్రకటన ఇలా వచ్చిందో లేదో.. అలా దాని గల్లాపెట్టె నిండిపోయింది. డిజిటల్ పేమెంట్స్ బీభత్సంగా పెరిగాయి. ఆ రూట్లోనే అనేక ఆన్ లైన్ పేమెంట్ సంస్థలు కళకళలాడుతున్నాయి.