చెత్త వుంటే పంపి పుణ్యం కట్టుకోండి మహాప్రభో..!

చెత్త వుంటే పంపి పుణ్యం కట్టుకోండి మహాప్రభో..!

రచన srikanth sri తేది 23/09/2016

అవును మీరు చదివింది నిజమే. స్వీడన్ దేశానికి గార్బేజ్ కరువొచ్చింది. మీ దగ్గర ఎంత చెత్త ఉంటే అంత పంపి పుణ్యం కట్టుకోండి బాబూ అని పక్క దేశాలకు కబురు పంపింది. ఎందుకంటే ఆ దేశంలో ఉత్పత్తయ్యే కరెంటులో సగం- చెత్త, ఇతర రెన్యూవబుల్ సోర్సుల నుంచే జెనరేట్ అవుతుంది. 1991 నుంచి శిలాజ ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని మాగ్జిమం తగ్గించింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడొక్కసారిగా ఆ దేశానికి చెత్తకు కరువొచ్చే సరికి పవర్ ప్రొడక్షన్ ఢామ్మని పడిపోయింది. 2014లో 8లక్షల టన్నుల చెత్తను జర్మనీ, నెదర్లాండ్స్ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారంటే.. పవర్ ప్రొడక్షన్‌లో చెత్త పాత్ర ఏంటో మీరే ఊహించుకోవచ్చు.
 
గత రెండు దశాబ్దాలుగా చెత్త రీ సైక్లింగ్ చేయడంలో ఏ దేశమూ అందుకోలేనంతగా స్వీడన్ అడ్వాన్స్ అయిపోయింది. గత ఏడాది ఆ దేశంలో కేవలం ఒక్క శాతం చెత్త మాత్రమే వృథా అయిందంటే అర్ధం చేసుకోవచ్చు..స్వీడన్ ప్రజలకు ప్రకృతి, పర్యావరణం సమస్యలపై ఎంత అవగాహన ఉందో. పనికిరానిది ఏదీ బయటకి విసిరికొట్టరు. ఆ విషయంలో ఎంతో స్ట్రిక్టుగా ఉంటారు. రీ సైక్లింగ్ అన్నది వాళ్ల దృష్టిలో చాలా విలువైనది.