2017 నుంచి గూగుల్ ఏం చేయబోతోందంటే..

2017 నుంచి గూగుల్ ఏం చేయబోతోందంటే..

రచన 2 తేది 01/09/2016

మీకు తెలుసా.. గూగుల్ సంస్థ వినియోగించే ఓవరాల్ కరెంట్ శాన్ ఫ్రాన్సిస్కో సిటీకి మొత్తానికి సరిపోతుంది. దీన్నిబట్టి ఇమాజిన్ చేసుకోవచ్చు.. దాని విద్యుత్ వాడకం ఏ రేంజిలో వుందో.. అందుకే ఇంటర్నెట్ దిగ్గజం ఒక చారిత్రాత్మక అడుగు ముందుకు వేసింది. వచ్చే ఏడాది నుంచి.. అంటే 2017 నుంచి వంద శాతం విండ్ ఫామ్స్, సోలార్ ప్యానెల్ ద్వారానే కరెంటు వినియోగించాలని నిర్ణయించింది.
 
గూగుల్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా డేటా సెంటర్లున్నాయి. మొత్తం 60వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూట్యూట్, జీ మెయిల్, ఇతరాత్ర కలుపుకుని ఎనిమిది దాకా సెర్చ్ ఇంజిన్లు బిజినెస్ చేస్తున్నాయి. 1 బిలియన్ కస్టమర్లున్నారు. మొత్తం 13 అతిపెద్ద డేటా సెంటర్లు ఆపరేట్ అవుతున్నాయి. అన్ని క్యాంపస్ లు, ఆఫీసుల్లో కలిసి లక్షల కంప్యూటర్లు నడుస్తున్నాయి.
 
2015లో గూగుల్ సంస్థ 5.7 టెరావాట్ గంటల రిన్యూవబుల్ ఎనర్జీని వాడింది. అంటే యూకేలో ఒక ఏడాదికి ఎంత సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందో అంత ఒక్క గూగులే వాడిందన్నమాట. అమెరికాతో పోల్చుకుంటే.. ఆ దేశం ఏడాది పొడవునా జెనరేట్ చేసిన విండ్ పవర్ తో సమానం.  
 
నిజానికి గూగుల్ సంస్థ మొత్తం వాడే విద్యుత్ లో రిన్యూవబుల్ ఎనర్జీ వాటా 44 శాతం. ప్రపంచంలోనే అంత పెద్ద మొత్తంలో క్లీన్ అండ్ గ్రీన్ కరెంట్ వాడుతున్న ఏకైక కార్పొరేట్ దిగ్గజం కూడా ఇదే. గత దశాబ్దకాలంగా చూసుకుంటే పలు సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడా వాటాను వందకు వంద చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే పూర్తిగా సోలార్, విండ్ పవర్ మీదనే ఆధారపడాలని నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని చూస్తోంది.
 
ఇతర విద్యుత్ ప్రాజెక్టులతో పోల్చుకుంటే సోలార్, విండ్ పవర్ అతి చవకైనది. ఇది దీర్ఘకాలికంగా పర్యావరణానికి ఎంతో మేలుచేస్తుంది కూడా. అందుకే క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ కోసం తమ వంతు పాత్ర పోషించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ చెప్తోంది. వంద శాతం కార్బన్ రహిత విద్యుత్ వాడకం కోసం పదేళ్ల అగ్రిమెంట్ చేసుకోవాలని చూస్తోంది. న్యూక్లియర్ పవర్ విషయంలో అవుతున్న కాంట్రవర్సీ నుంచి దూరం కావాలని ఆ సంస్థ భావిస్తోంది. అందులో నడిచే డ్రామా నుంచి పూర్తిగా బయటపడాలనే ఈ నిర్ణయానికొచ్చినట్టు గూగుల్ తెలిపింది.